*మీ కోసం మేమున్నాం పిలుపుతో స్పందించిన దాతలు
* బాధిత వ్యక్తికి మీకోసం మేమున్నాం కార్యాలయంలో నగదు అందజేత
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:చర్ల మండలం లోని లింగాపురంపాడు గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ సోయం అర్జునరావు(34)కు పేగు క్యాన్సర్ వ్యాధి సోకడంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని పలు వైద్యశాలలకు తిరగవలసి వచ్చింది. కొత్తగా పెళ్ళి చేసుకుని, అంతంతమాత్రంగా కుటుంబాన్ని వెల్లదీస్తున్న వీరి కుటుంబ పరిస్థితి కడుదయనీయంగా ఉండడంతో వారు *వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం కోసం మీకోసం మేమున్నాం సంస్థను* ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫండ్ రైజింగ్ పోస్టు ద్వారా పలువురి దాతల సహకారంతో సేకరించిన రూ.25,000 /- ఆర్థిక సహాయాన్ని సోమవారం చర్ల లోని మేమున్నాం కార్యాలయంలోని బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. AITUC బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ – చర్ల అధ్యక్షులు గుంజి మాల్యాద్రి చేతుల మీదుగా ఆఆర్థిక సహాయాన్ని మేమున్నాం కార్యాలయంలో అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆ సంఘంచైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ.. పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు తలా ఓ చేయి వేసి ఆదుకుని , వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండడం ఎంతో పుణ్యకార్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి తాపీమేస్త్రీలు నాగేశ్వరరావు, తిరుపతి, రాజేష్, అనిల్, సత్యనారాయణ, వెంకట్రావు మరియు మేమున్నాం సభ్యులు పాల్గొన్నారు.
