నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతుండడంతో వాటికి బర్డ్ ఫ్లూ సో కింద అనే అనుమానాలు అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఎలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పాదలకూరు,కోవూరు మండలాలలో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తమైన ఆ జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఆయా ప్రాంతాల పరిధిలో ఒక్క కిలోమీటర్ పరిధి వరకు మూడు నెలలు షాపులు తెరవకూడదని ఆదేశించారు. అలాగే 10 కిలోమీటర్ల పరిధిలోని చికెన్ షాపు యజమానులు మూడు రోజుల వరకు షాపులు తెరవకూడదని చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆయా ప్రాంతాలలో ఫామ్స్, చికెన్ షాపులో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారిగా కోళ్లు మృత్యువాత పడడంతో ఫామ్స్ నిర్వాహకులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు. కోరడమైనది.
