ఆపదలో ఆపన్నహస్తం మీ కోసం మేమున్నాం సహక సమితి:రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు
* డయాలసిస్ బాధిత వ్యక్తి రూ.10 వేల ఆర్ధిక వితరణ అందజేత
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఏజెన్సీ వాసులకు ఆపదలో ఆపన్నహస్తం గా చర్ల మీ కోసం మేమున్నాం సహక సమితి నిలుస్తోంది అని చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు అన్నారు.
చర్ల మండలం లోని మొగల్లపల్లి – చింతకుంట గ్రామానికి చెందిన మచ్చ నర్సింహారావు కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి.మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులు తిరగడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.ఈ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మీకోసం మేమున్నాం టీం ద్వారా ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి, పలువురు దాతల నుండి సేకరించిన రూ .10,000 /- చర్ల మేమున్నాం కార్యాలయంలో, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు చేతుల మీదుగా బుధవారం కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మీ కోసం మేమున్నాం సహాయక సమితి చైర్మన్ లయన్ నీలి ప్రకాష్, జవ్వాది సతీష్, అక్కినేని నెహ్రూ, కవ్వాల రాము, దొడ్డ ప్రభుదాస్, దొడ్డి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
