నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభుర్గంపాహాడ్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని భుర్గంపాహాడ్ తహశీల్దార్ ముజాహిద్ హెచ్చరించారు.ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక రవాణా చేసిన స్టాక్ పాయింట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయనున్నట్లుగా తహశీల్దార్ తెలిపారు.
అనధికారికంగా ఉన్నటువంటి అక్రమ ఇసుక ర్యాంపులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఇసుక రవాణా చేసే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలతో పాటు అధిక మొత్తంలో ఫైన్ కూడా విధించనున్నట్లు పేర్కొన్నారు.
సామాన్యులకు అందుబాటులో ఇసుకను అందించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టుగా పేర్కొన్నారు.
Post Views: 58