నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర జ్వరం మూలంగా సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వైద్యం కొరకు రేగా అనుచరులు మణుగూరు 100 పడుకల ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆదివారం భద్రాద్రి బీ ఆర్ ఎస్ బాస్ రేగా కాంతారావు జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం నీరసించినట్లు తెలియ వచ్చింది. వైద్యం కొరకు రేగ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం.
Post Views: 407