నేటి గధర్ న్యూస్,జూలూరుపాడు:మండల పరిధి మాచినేనిపేట తండా గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బేతాళపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు .అదే సమయంలో అటువైపు వెళుతున్న జూలూరుపాడు ఎస్ఐ జీవన్ రాజు తక్షణమే స్పందించి 108 వాహనంలో వైద్యం కోసం క్షతగాత్రున్ని కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ఎస్సై జీవన్ రాజు చొరవను పలువురు అభినందించారు.
Post Views: 224