– జాతర కు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం
– సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికిన పూజారులు.
నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఆదివాసీల సాంస్కృతి సంప్రదాయాలు భిన్నమైనవని.. ఇవి సాంస్కృతిక చిహ్నాలుగా నేటికీ వెలుగొందుతున్నాయని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం అమరారం గ్రామంలో మూడు రోజులపాటు జరగనున్న నాగులమ్మ జాతరకు ముఖ్యఅతిథిగా హాజరై గిరిజన సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఆలయ దేవర బాలలు విశేష పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశంలోనే భిన్నమైన సాంస్కృతి సంప్రదాయాలతో ఆదివాసీలు తమ జీవన విధానం కొనసాగుతుందని, వాటికి కొనసాగింపుగా , గిరిజన జాతరలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, పేరం వెంకటేశ్వరరావు, పోనుగొటి చందర్ రావు, తోలేం అర్జున్, కొమరం లాలయ్య, యలం బుజ్జి బాబు, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బుల్లిరెడ్డి (తిరుపతి రెడ్డి) వుడుముల లక్ష్మీరెడ్డి, మాజీ సర్పంచ్ లు తోలెం కళ్యాణి, గొగ్గల నాగేశ్వరరావు, ఈసం భవతి, బెక్కం నర్సింహారావు, బూర రవి, రాము, పాల్గొన్నారు.









