★💥💥KCR మతి ఉండి మాట్లాడుతున్నవా?మందు ఏసీ మాట్లాడుతున్నవా>> సన్నసోడా… దద్దమ్మ… దిక్కు మలినోడా…చవట.. దద్దమ్మ…దివాన గా కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు💥💥💥
★రేవంత్ రెడ్డి మాటలకు ఓట్లు రాలొచ్చు…కానీ చిన్నారులు…యువత అవే మాటలు ఫాలో అవుతున్న వైనం
★ కోడలకు బుద్ధి చెప్పి…అత్తె తెడ్డు నాకింది సామెత గుర్తు చేస్తున్న ప్రజలు
★మాటల్లో KCR డిగ్రీ… మల్లన్న PG చేస్తే రేవంత్ Phd చేశాడని మాట్లాడుతున్న యువత,ప్రజలు
★బాధ్యత గల CM బూతు పురాణం పై పెదవి విరుస్తున్న సబ్బండ వర్గాల ప్రజలు
నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి: సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దేశ రాజకీయాలలో సంచలనం. ఆయన గురించి చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం జీరో నుండి స్టార్ట్ అయి హీరో లాగా ఎదిగారు అనడంలో ఎలాంటి డౌట్. దాని వెనకాల ఎంతో కృషి…. కష్టం బాధ దుఃఖం అన్ని భరించిన తర్వాతనే నేడు తెలంగాణ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం అనే స్టేజి నుండి నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అంతవరకు తీసుకోవచ్చారు. ముఖ్యమంత్రి పదవి అలంకరించక ముందుకు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఈ భాష పదజాలం అయితే వాడారో నేడు సీఎం హోదాలో కూడా దానికి మించి బూతు పురాణం మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు సబ్బండ వర్గాలు రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ప్రజలు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు. నేడు అధికారంలోకి వచ్చాక అంతకుమించి కామన్ పీపుల్ వాడని పదాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నోట రావడం ప్రజలు, విద్యావంతులు, యువకులు ఇంటర్నల్ గా ఖండిస్తున్నారు. సీఎం రేవంత్ స్పీచ్ సందర్భంగా ఇలలు వేసిన వారే బయట ఆ మాటలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది నగ్నసత్యం. సీఎం రేవంత్ రెడ్డి మాటలను మారుమూల పల్లెటూర్లలో సైతం చిన్నారులు యువకులు ఉచ్చరిస్తున్నారు. దీనితో వారి తల్లిదండ్రులు సీఎం రేవంత్ రెడ్డిని చూసి ఆ మాటలు చేర్చుకున్నారా అని మాట్లాడుకుంటున్నారు. కోడలికి బుద్ధి చెప్పి అత్తే తెడ్డు నా కింద అనే సామెతలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. మాటలలో మాజీ సీఎం కేసీఆర్ డిగ్రీ చేస్తే రేవంత్ రెడ్డి పిహెచ్డి చేశాడా అని ప్రజలలో చర్చ. ఎన్నో వ్యయ ప్రయాసలకు గూర్చి, అనేక అడ్డంకులను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన కేసిఆర్ ను పదేపదే బూతులు తిట్టడంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఇంత తక్కువ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ సభలకు జనాధారణ పెరగడం కూడా ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టిన కొద్ది కెసిఆర్ కి సింపతి పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైన సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వాడే భాష విధానంలో మార్పు రావాలని సబ్బండ వర్గాల ప్రజలు కోరుతున్నారు.