◆విజేతలకు బహుమతులు అందజేసిన
కరకగూడెం,తాడ్వాయి ఎస్ఐ లు రాజేందర్,శ్రీకాంత్ రెడ్డి.
◆యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
నేటి గద్దర్ న్యూస్ , కరకగూడెం:
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కరకగూడెం,తాడ్వాయి ఎస్ఐలు రాజేందర్,శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
అదివారం కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామంలో వీపీఎల్ సీజన్-3 సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొని,విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించి,తల్లిదండ్రులకు,గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.మద్యపానానికి అలవాటు పడకూడదని,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని,తల్లిదండ్రులు పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు.యువత ఉన్నత చదువులు చదువుకోవాలని,అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం అయిన అందిస్తామని అన్నారు.అనంతరం వీపీఎల్-3 విజేతలు మొదటి బహుమతి సివిల్(మణుగూరు)జట్టు,రెండోవ బహుమతి రంగాపురం జట్టు,సంయుక్త బహుమతులు చొప్పాల,కొత్తగూడెం జట్లలకు బహుమతులతో పాటు నగదు అందజేశారు.ఈ టోర్నీ నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,క్రీడాకారులు,టోర్నీ నిర్వాహకులు గుడ్ల రంజిత్,వెంగళి గోపి,కల్తీ నరేష్,బోడ ముత్తయ్య,కొమరం సతీష్,ఇర్ప సునీల్ తదితరులు పాల్గొన్నారు.