పోలింగ్ సరళిలో అధికార పార్టీకి చుక్క ఎదురు అంటూ ప్రచారం..
అదే జరిగితే కాంగ్రెస్ నాయకులకు చుక్క ఎదురేనా..?
లోకల్ నాయకుల అలసత్వం మంత్రి పొంగులేటికి తలవంపు తెచ్చేనా..?
నేటి గదర్,మే 28 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది… ఇక సామాన్యుల నుండి రాజకీయ విశ్లేషకుల వరకు ఎమ్మెల్సీ ఓటింగ్ సరళిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. ఇక పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఎందుకో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీచింది అనే చర్చ విస్తృతంగా సాగుతుంది… ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులోని కూసుమంచి మండలంకి ఎంతో ప్రాధాన్యత ఉంది.. మనసున్న నాయకుడు …మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పేరు వినిపిస్తేనే ఎగిరి గంతులు వేసే కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.. అందుకే ఆయనకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు బారి మెజారిటీ ఇచ్చి తమ ప్రేమను , అభిమానాన్ని చాటుకున్నారు.. అంతటి ఘన విజయం వెనక నాయకులుగా చలామణి అవుతున్న వారితో వచ్చిన ఓట్లు కావవి… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎనలేని ప్రేమను పెంచుకున్న కార్యకర్తల ,అభిమానుల ప్రేమతో మాత్రమే వచ్చిన ఓట్లవి … కానీ మండల స్థాయి నాయకుల నుండి గ్రామ స్థాయి నాయకులుగా చలామణి అవుతున్న నాయకులు (కానీ నిజమైన కాంగ్రెస్ వాదులు ,కష్టపడ్డ వారు కాదు అలాగే పాత కొత్త అనే తేడా లేదు) మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాల్లో వచ్చిన మెజారిటీ ఓట్లుకు తామే కారణం తమ కష్టార్జితం అనుకుంటూ తమ ఉపన్యాసాలు ఉదరగొడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర తమ గొప్పలు ఉదరగొడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సరే వారి ప్రచారాలు ఎలా ఉన్నా అసెంబ్లీ మెజారిటీ అనేది గతం ..కానీ నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూసుమంచి మండలంలో జరిగిన పోలింగ్ సరళి మాత్రం అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీ తరపున పోటీలో నిలబడిన వ్యక్తికే అధిక సంఖ్యలో పట్టభద్రులు మరలినట్టు ప్రచారం జరగడం కోస మెరుపు.. నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా పూర్తి కాక ముందే వ్యతిరేకత అంటూ ప్రచారం జరగడానికి కారణం ఎవరు అంటే.. ముమ్మాటికీ మాత్రం కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండల ,గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల మధ్య విభేదాలు… అలాగే మండలం ,గ్రామ స్థాయిలో ఉన్న ముఖ్య నాయకుల సమన్వయం లోపం కారణంగానే పట్టభద్రులను కాంగ్రెస్ వైపు మరలించే ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో చేయకపోవటమే మరో కారణంగా కనిపిస్తుంది అనే అనుమానం వ్యక్తం అవుతుంది.. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు , కాని 5వ తేదీన వెలువడే ఫలితం మాత్రం మండలంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువగా వస్తె మండల , గ్రామ స్థాయి నాయకులకు అది చంపపెట్టే… ఒకవేళ మెజారిటీ రాకపోతే మాత్రం ముమ్మాటికీ మండల ,గ్రామ స్థాయిలో నాయకులుగా చలామణి అవుతున్న నాయకులే కారణం అవుతారు అనడంలో అతిశయోక్తి కాదు.. వీరి విపరీత పోకడ వాళ్ళే పార్టీకి నష్టం కలిగింది అనే చర్చ విస్తృతంగా ప్రచారం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు.. చూడాలి నిన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అధికార పార్టీకి మెజారిటీ వస్తె నాయకులు అందరూ సేఫ్ అన్నట్టే .. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తమ ధోరణిని మార్చుకుని అందరినీ కలుపుకపోతే తప్ప పరిస్థితులు అనుకూలంగా మరే అవకాలు లేవనే చెప్పాలి .. లేదా ఈ నాయకుల కారణంగానే కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గంలో మసకబారే అవకాశం లేకపోలేదు.. ఈ పరిస్థితులను తప్పక చక్కదిద్దాలి అనుకుంటున్నారు మండల ప్రజలు..