★బంగారం,వెండి,ద్విచక్ర వాహనం,ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
*సి ఐ సతీష్ కుమార్ వెల్లడి.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 28:
మణుగూరులో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి నుండి 9 తులాల బంగారం,10 తులాల వెండి,ద్విచక్ర వాహనం,ఒక లాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లుగా మణుగూరు సి ఐ సతీష్ కుమార్ తెలిపారుమణుగూరు CI కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. దొరిశెట్టి స్వామి నిరంజన్, మోహన్ అనే వ్యక్తులు ముఠా గా ఏర్పడి కొత్తగూడెం భద్రాచలం ,మణుగూరు, భూపాలపల్లి ,రామగుండం వివిధ ప్రాంతాల్లో దొంగతనాల కు పాల్పడినట్లు సిఐ తెలిపారు.వీరిపై మణుగూరు మండల పరిధిలోని పీవీ కాలనీలో ,అలాగే కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో గతంలో 14 కేసులు ఉన్నట్లుగా సిఐ సతీష్ కుమార్ వెల్లడించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు ఈసమావేశంలో CI మేడ ప్రసాద్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.