జూన్ 7 నుంచి జరిగే మాదిగల జన సభలను జయప్రదం చేయండి…
మాదిగ జేఏసి వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా పిడమర్తి రవి.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (హైదరాబాద్ మే 28):
మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7 నుంచి జరిగే మాదిగల జన సభలను జయప్రదం చేయాలని మాదిగ జేఏసి వ్యవస్థాపకులు, తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా పిడమర్తి రవి కోరారు.
హైదారాబాద్ లోని హిమాయత్ నగర్,మినర్వా హోటల్ లో మాదిగ జేఏసి రాష్ర్ట జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు, మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్ తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.మాదిగ జేఏసి వ్యవస్థాపకులు, రాష్ట్ర తొలి యస్సి కార్పొరేషన్ చైర్మన్ డా పిడమర్తి రవి మాట్లాడుతూ, మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనే ఏకైక లక్ష్యంగా మాదిగ జేఏసి సంఘం పని చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల జనజాతర సభలు జూన్ నెల నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని కోరారు.మొదటి మాదిగల జన జాతర సభను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జూన్ 7వ తేదిన జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.