నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 06):
రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు 14మంది ఎంపికయ్యారని ఏటూరునాగారం స్పోర్ట్స్ కోచ్ కుమారస్వామి తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన బుధవారం క్రీడాపోటీల వివ రాలను వెల్లడించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 3న జాకారంలోని సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రీడల్లో ఏటూరునాగారం క్రీడా కారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 14 మంది వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ క్రీడాకారులు నేడు, రేపు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియ పోటీల్లో పాల్గొగొంటారని కోచ్ చెప్పారు..
Post Views: 336