భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు…
అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు…
నేటి గదర్ న్యూస్,వెంకటాపురం ప్రతినిధి జులై 21:
వెంకటాపురం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.పాలెం వాగు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో వర్షం నీరు అధికంగా చేరడంతో క్రింది గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.వెంకటాపురం మండలం పరిధిలోని పాత్రపురం గ్రామం సమీపంలో ఉన్న బల్లకట్టు వాగు ఉదృతంగా ప్రవహించడంతో దగ్గరలో ఉన్న నివాస ప్రజలు ఏ క్షణంలో ఏమి జరుగునోనని భయబ్రాంతులకు గురౌతున్నారు. గత సంవత్సరం కూడా వరద ముంపు కు ప్రజలు అనేక ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.గతంలో ముంపుకు గురైన ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని,ఈ సంవత్సరం కూడా అలా జరగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.మరొక 30 మీటర్లు దూరం గోదావరి వరద నీరు చేరితే ఇళ్లలోకి వస్తుందని భయాందోళనకు ప్రజలు గురౌవుతున్నారు.ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.