రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 28:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు బోర్ మోటర్ల కేబుల్ వైర్ల దొంగతనానికి పాల్పడిన సంఘటన జరిగింది.పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన టంటం గోవర్ధన్ తండ్రి రాములు వయస్సు 47 సంవత్సరాలు తను గత నెల రోజుల క్రితం తన యొక్క వ్యవసాయ పొలం దగ్గర బోర్ మోటార్ కు కొత్త కేబుల్ వైరు వేయగా నడుస్తుందని తెలిపారు.ఈరోజు తేది 28-01-2025 నాడు ఉదయం అందజా 7:00 గంటలకు బోరు స్టార్ట్ చేయటం గురించి పొలం దగ్గర బోర్ మోటార్ ఆన్ చేస్తే కేబుల్ వైరు కనిపించలేదని పేర్కొన్నారు.ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు ఉందని తనతో పాటు గ్రామానికి చెందిన కొంత మంది మోటార్ వైర్లు దొంగతనం అయినట్లు దరఖాస్తు ఇచ్చినట్లు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ తెలిపారు.