+91 95819 05907

ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

★ఎన్నికల కోసమే ప్రజలను మభ్యపెట్టడమే ప్రభుత్వం పని

నేటి గదర్ కరకగూడెం:అడ్డమైన పథకాలతో ప్రజలను మోసం చేసి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బిఅర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలతో మండలంలోని ఒక గ్రామమును ఎంచుకొని కేవలం అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా‌ ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించారు.ఏజెన్సీ ప్రాంతంలో ఎంతోమంది గిరిజన గిరిజనేతరులు రైతులు పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూన్నారు.అలాంటి అర్హులైన రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం ఇదెక్కడి న్యాయమని తెలిపారు.కేసిఆర్ ఆధికారంలో ఉన్నప్పుడు ప్రతి రైతుకు రైతుబంధు తోపాటు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిందని అన్నారు‌ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రైతు భరోసా రుణమాఫీ చేస్తానని చెప్పి తిండి పెట్టే రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు.గిరిజనుల సమస్యలు చెప్పుకుందాం అనుకుంటే కనీసం గిరిజన శాఖ మంత్రి, కూడా లేరని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వల్లో గిరిజన శాఖ మంత్రి లేరని,అసలు గిరిజన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నారని మండిపడ్డారు.పంట పండించే ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల‌ పక్షాన బీఆర్ఎస్ నిలపాడి రైతు భరోసా వచ్చేంత వరకు పోరాడుతామని అన్నారు.అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం మయ పథకాలతో ప్రజలను మభ్యపెట్టడం కోసమే చేస్తున్న పని అని, గ్రామాలలో ఎవరు కూడా వినే పరిస్థితి లేదని తెలిపారు. ఎన్నికల్లో ఆరు గ్యారంటీల తోపాటు 420 హామీలు ఇస్తామని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ సమావేశంలో పోగు.వెంకటేశ్వర్లు, బుడగం రాము,మాజీ సర్పంచ్ ఊకె. రామనాథం,బైరిశెట్టి చిరంజీవి ,రావులకనకయ్య ఎస్డి ఫజల్ గుడ్ల రంజిత్ చిట్టి మల్ల ప్రవీణ్ దాసరి సాంబయ్య కల్లూరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు…దొండపాటి రమేష్

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గం ప్రతినిధి కొణిజర్ల :వ్యవసాయంలొ రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టనీకుండా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం

Read More »

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం :రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య

రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికై గ్రౌండింగ్ అయి అకౌంట్లో

Read More »

ప్రేమ పెళ్లి చేసుకున్నాడు… మొఖం చాటేస్తున్నాడు.. న్యాయం కొరకు ధర్నాకు దిగిన వివాహిత

💥 బ్రేకింగ్ న్యూస్….. 💥 బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, పిచ్చయ్య. న్యాయం చేయాలంటూ భాదిత మహిళా ఆవేదన. బోనకల్

Read More »

సీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. – ఉత్తర్వులు జారీ చేసిన కేన్ కమిషనర్ జి. మల్సూర్. – మంత్రి పొంగులేటి సూచనల మేరకు నూతన కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు జీవోలో వెల్లడి.

Read More »

ఆదివాసీ ఐకస మహిళా నూతన కార్యదర్శిగా. కుంజా. దుర్గ

నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ కొమురం భీం భవన్ ఎస్టీ వర్గీకరణ సాధనకై ఆదివాసి ఆడపడుచులందరూ ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చిన… కుంజ దుర్గ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ అధ్యక్షన జరిగిన ఆదివాసి మహిళా

Read More »

వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.

ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా కళా మండలి అధ్యక్షులు మాసాయిపేట యాదగిరి మాదిగ. మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి జనవరి 29. ఫిబ్రవరి 7 వ తేదీన హైదరాబాద్

Read More »

 Don't Miss this News !