★జాతర ఏర్పాట్లపై సమీక్షసమావేశం పివో రాహుల్
నేటి గదర్ కరకగూడెం:మండలంలోని చిరుమళ్ళ గ్రామపంచాయతీ లోని సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న ఐటీడీఏ పిఓ రాహుల్. ఆలయ ప్రధాన ద్వారం వద్ద సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యులు చందా లింగయ్య, వీరయ్య, బిక్షపతి, భూపతయ్య, ఆలయ కమిటీ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆదివాసీ నృత్యాలతో గుడి వద్దకు తీసుకొని వచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి, ఆలయ అర్చకులు బొట్టుపెట్టి శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రజలు ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పురాతనం నుంచి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తూ వస్తున్నామని ఆది దేవత సమ్మక్క తల్లి జాతరకు ఖర్చు ఎక్కువగా పెరుగుతుందని వారు తెలియజేశారు. అనాదిగా మేడారం పెద్ద జాతర తర్వాత సంవత్సరం తరువాత పుట్టినిల్లు అయిన చిరుమళ్ళ సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తూ వస్తున్నామని వారు తెలిపారు. 2023లో 128 ఇలవేల్పులతో అంగరంగ వైభవంగా నిర్వహించామని వారు పిఓ దృష్టికి తీసుకువచ్చారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. త్రాగునీరు, షెడ్లు, పురాతనంలో కట్టిన గద్దె మరమ్మత్తులు చేయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో బి రాహుల్ మాట్లాడుతూ. గిరిజన జాతరకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అని తెలిపారు. ఆలయ కమిటీ వారు తక్షణం కావాల్సిన వాటిని ఇలవేల్పుల కలయిక అయ్యే ఖర్చు వివరాలను తమకు అందించాలని తక్షణమే వాటిని మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని, పది రోజుల కాలం ఉండడంతో ఏది అవసరమో అది పూర్తి చేద్దామని శ్రేష్టంగా పరిష్కారాయే సమస్యను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికారులను పంపించి తక్షణమే పూర్తి అయ్యే పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయిస్తానని అన్నారు. అధికారులకు ఏ ఏ అవసరమో వాటిని చూపించాలని ఆలయ కమిటీ వారిని కోరారు. అనంతరం చందా లింగయ్య దొర మాట్లాడుతూ నివేదిక సిద్ధం చేసి వచ్చి తమరు కలుస్తామని జాతరకయ్యే ఖర్చు పనులను పర్యవేక్షించడానికి వచ్చినందుకు గిరిజనాభివృద్ధి సంస్థ పిఓ బి రాహుల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఆదివాసి సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆరు గ్రామాల ప్రజలు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.