నేటి గదర్ న్యూస్ జనవరి 28:వైరా ప్రతినిధి
వైరా,కొణిజర్ల,తల్లాడ,ఏన్కూర్, చింతకాని మండలాల ప్రజలు ప్రస్తుతం కోర్టు కేసుల నిమిత్తం మధిర, సత్తుపల్లి, లేదా ఖమ్మం వెళ్ళవలసి వస్తుంది. బలహీన వర్గాలు, మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు న్యాయం పొందడంలో ఆర్థిక పరంగా రవాణా పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వైరా నియోజకవర్గ కేంద్రం అయిన వైరాలో మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉన్నదని కోర్టులు లేకపోవడం వలన కాక్షిదారులు,న్యాయవాదులు ఇబ్బందులు పడవలసిన వస్తుందని, కోర్టు విచారణలకు హాజరు కావడం చాలా కష్టంగా మారిందని అందువలన వైరామండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. 2009లో వైరా నియోజకవర్గంగా మారినప్పటికీ వైరా నుండి దాదాపు 35-45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధిరలో కోర్టుకు లేదా సత్తుపల్లి కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందని అదే వైరాలో కోర్టు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రమైన వైరాలో మేజిస్ట్రేట్ కోర్టు సముదాయం ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ ఖమ్మం జిల్లా కోర్టు రెండవ సీనియర్ సివిల్ కోర్టు ప్రారంభం కోసం విచ్చేసిన తెలంగాణ హైకోర్టు జడ్జి ఖమ్మం జిల్లా పోర్టు పోలియో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీమతి సాయి సుధగారికి వినతి పత్రాన్ని సమర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ నేరెళ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీ చింతనిప్పు వెంకట్, పలువురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వైరా ప్రాంతానికి చెందిన న్యాయవాదులు శ్రీసంపసాల వరదరాజు, శ్రీబండారు నరేష్ బాబు, శ్రీలగడపాటి కృష్ణమోహన్, శ్రీలగడపాటి నెహ్రూ, శ్రీచెరుకూరి సుబ్రమణ్యం, కుమారి ఫణిహారం లిఖిత తదితర ప్రముఖ న్యాయవాదులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.