★ప్రజలందరికీ సమాన న్యాయం , సామరస్యం చాలా అవసరం కలెక్టర్
★రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారం దేశంలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవించి,ఇష్టమైన ఏ వృత్తినైనా చేపట్టవచ్చు కలెక్టర్
★ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి*
★రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను కాల రాస్తే చట్ట వ్యతిరేక పనులకు పూనుకుంటే సహించేది లేదు
★మనోరాబాదు మండలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్, తూప్రాన్ ఆర్డిఓ జై చంద్రారెడ్డి, సంబంధిత ఇతర శాఖల అధికారులు ప్రజలు*
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మనోహరాబాద్ నేటి గద్దర్ సెప్టెంబర్ 24.
సోమవారం మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో కుల బహిష్కరణ
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ప్రజలందరూ సమానం అనే భావనతో కలిసికట్టుగా ఉండాలని గ్రామంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులకు భంగం కలిగించే వారికి తప్పక శిక్ష పడుతుందని , మనమందరం రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉండాలని ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి శిక్ష పడితే ఆ కుటుంబం ఎంతో బాధను అనుభవిస్తుందని
వీటన్నిటిని గుర్తించుకోవాలన్నారు.
గ్రామంలో ఎస్సీ కులముకు చెందిన వృత్తి డప్పు కొట్టలేదని కుల బహిష్కరణ చేసి వస్తువులు ఇవ్వకుండా
త్రాగునీరు, రేషన్ కిరాణా, మనసు విప్పి మాట్లాడటం ఇటువంటి విషయాలు జరుగుతున్నాయని ప్రభుత్వపరంగా ఎస్సీ ఎస్టీ చట్టంపై సత్వరం ప్రజలకు అవగాహన కల్పించి సామరస్యంగా అన్ని చక్కబడే ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని పరిస్థితులు చక్కదిద్దే ఏర్పాటులలో అన్ని సమపాలలో అందుతున్నాయని ప్రజల నుండి తెలుసుకున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పగడ్బందీగా చర్య తీసుకుంటామని ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కుల బహిష్కరణ చట్ట వ్యతిరేకంగా చూపబడుతుందని ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడిన కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుందన్నారు.