*సిపిఎం మహాసభలు అంటేనే ప్రజా సమస్యల ఎజెండా*
*ఆరు గ్యారెంటీన్లు కచ్చితంగా అమలు చేయాలి*
– *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు*
కరకగూడెం: సిపిఎం మహాసభలు అంటేనే ప్రజాసమస్యలు ఎజెండాగా చర్చ ఉంటుందని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు ఆదివారం పార్టీ మూడో మహాసభ కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ కుంజ కృష్ణకుమారి ప్రాంగణంలో ఊకే నరసింహ రావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా అమరవీరులకు పూలతో జోహార్లు అర్పించారు అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని అన్నారు ఇచ్చిన ఆర్గారంటీల్లో సగం మాత్రమే అమలవుతున్నాయని మిగతా వాటిని ఎప్పుడు అమలు చేస్తారు తెలపాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు డిసెంబర్ నెలలో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వాగ్దానాల అమలుపై ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ మండలంలోపోడు భూముల పోరాటం ద్వారా రైతులుగా మార్చిన ఘనత సిపిఎంకే ఉందని పట్టాలు సాధించడంతోపాటు తునికి ఆకు బోనస్సు మంచినీరు రోడ్లు ఇతర వలస ఆదివాసి గ్రామాల సమస్యలపై నిక్కచ్చిగా పోరాడిన పార్టీ సిపిఎం అని సిపిఎం పార్టీ మండలంలో ప్రజా పోరాటాలను విశిష్టపరిచాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు కొమరం కాంతారావు సర్ప సత్యం బిలపాటి శంకరయ్య కనితి రాము కోవాసి వెంకటేశ్వర్లు అడమయ్య పద్దం బాబురావు తదితరులు పాల్గొన్నారు