🚨”కురచ బుద్ధి + ప్రతీకార రాజకీయం = ఫార్ములా ఈ-రేస్ కేసు”👇
➡️”కురచ బుద్ధి”తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి డ్యామేజ్, రాష్ట్ర పరువు గంగపాలు
➡️”ప్రతీకార రాజకీయం”తో ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమ అరెస్టుకు కుట్ర చేయడం
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఇంతకుమించి ఏం కనిపించడం లేదు
అదెలాగో ఓసారి చూద్దాం
ఫార్ములా 1 రేస్ ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఈవెంట్
ఈ రేస్ ఫ్యూయెల్ కార్లుతో జరుగుతుంది
దీనికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులుంటారు
అలాగే..
ఫార్ములా ఈ-రేస్ కు కూడా వలర్డ్ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులున్నారు
ఈ రేస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో జరుగుతుంది
ఫార్ములా ఈ-రేస్ ఒక స్పోర్ట్స్ ఈవెంటే అయినా.. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే కాబట్టి ఎలక్ట్రిక్ కంపెనీలను, ఆ రంగానికి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకుని దీన్ని నిర్వహిస్తుంటారు.
సేమ్ అట్లనే..
ప్రపంచ నగరాలతో పోటీ పడి మరీ హైదరాబాద్ లో ఈ-రేస్ ను నిర్వహించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్టోబర్ 25, 2022న ఫార్ములా ఈ-రేస్ తో ఒప్పందం చేసుకుంది. 2023 ఫిబ్రవరి మొదటి వారంలో విజయవంతంగా ఫార్ములా ఈ-రేస్ ను నిర్వహించింది.
➡️దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.40 కోట్లు
➡️ప్రైవేటు ప్రమోటర్ ఖర్చు చేసింది రూ.110 కోట్లు
➡️మొత్తం చేసిన ఖర్చు రూ.150 కోట్లు
➡️ఈ రేస్ నిర్వహించడం వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన లాభం రూ.700 కోట్లు (నెల్సన్ అనే అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్ట్)
ఇలాగే..
ఒకటిరెండు రేసులు వరుసగా నిర్వహించి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను హైదరాబాద్‌కు పట్కరావాలి, తెలంగాణను ఒక ఎలక్ట్రిక్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో నెక్ట్స్ రేసు కూడా హైదరాబాద్ నిర్వహించాలనుకుంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.
కానీ..
అప్పటికే ఉన్న ప్రైవేటు ప్రమోటర్ తనకు గిట్టుబాటి కాని కారణంగా ఈ రేస్ నిర్వహణ నుంచి తప్పుకున్నాడు..
దీంతో ఆ ప్లేస్ లో ప్రమోటర్ గా హెచ్ఎండీయేను తాత్కాలికంగా పెట్టి మొత్తం మూడు విడుదతలకు గానూ రెండు విడతలుగా అక్టోబర్ 5, 2023 ఒకసారి, అక్టోబర్ 11, 2023న రెండోసారి హెచ్ఎండీయే నుంచి ఫార్ములా ఈ-రేస్ సంస్థకు ప్రభుత్వం చెల్లించింది. దీంతో షెడ్యూల్ క్యాలెండర్ లో పెడుతూ 19 అక్టోబర్ నాడు ఫార్ములా ఈ ప్రకటించింది.
తర్వాత ఎన్నికలు జరిగినయ్
డిసెంబర్ 3న ఫలితాలు వచ్చినయ్
బీఆర్ఎస్ ఓడిపోయింది
కాంగ్రెస్ పార్టీ గెలిచింది
డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిండు.
అదే నెల
డిసెంబర్ 13న ఫార్ములా ఈ-రేస్ సంస్థ కో-ఫౌండర్ ఆల్బర్టో లోంగో హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు.
మిగతా మూడో ఇన్‌స్టాల్మెంట్ డబ్బులు కట్టండి అని ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికీ డిసెంబర్ 19న ఆల్బర్టో లోంగో మెయిల్ చేసిండు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
మళ్లీ
డిసెంబర్ 22న ఫార్ములా ఈ లీగల్ డైరెక్టర్ మెయిల్ చేశారు. మీరు అగ్రిమెంట్ నిబంధనలు ఉల్లంఘించారు. మరో నాలుగు రోజుల్లో అంటే 26 డిసెంబర్ లోపు మూడవ విడదత డబ్బులు కట్టండి. లేకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది అని.
అయినా..
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో
హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన ఈవెంట్ రద్దు అయినట్టు ప్రకటించింది ఫార్ములా ఈ సంస్థ.
దీన్ని తప్పుబడుతూ ఎంతోమంది ప్రముఖులు ట్వీట్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి, హైదరాబాద్ నగర బ్రాండ్ మసకబారిందనేది వాస్తవం.
ఒకవేళ
కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మూడో విడద డబ్బులు కట్టి ఉంటే
హైదరాబాద్ లో మళ్లోసారి ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ జరిగేది
దాన్ని వల్ల అయితే ప్రభుత్వానికి లాభం జరుగుతది
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకింత పెరుగుతది
వస్తే తెలంగాణకు పెట్టుబడులు వస్తయ్ కావొచ్చు..
కానీ..
రాజకీయ ప్రతీకారం తీరదు కదా…
అందుకే..
కావాలనే మూడో విడదత డబ్బులు ఎగ్గొట్టి
అంతకుముందు పంపిన డబ్బులు అక్రమమని ప్రచారం చేసి, పత్రికల్లో, టీవీల్లో అదే పనిగా కథనాలు రాయించి, లేదిని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ప్రచారం చేయించి,
అవినీతే లేని కేసును అవినీతి నిరోధక శాఖకు అప్పజెప్పి, మసిబూసిమారెడు కాయను చేసి అక్రమ అరెస్టులకు పూనుకోవడమంటే.. ఇది ముమ్మాటికి ప్రతీకార రాజకీయ చర్య కాక మరోటి కాదు.
తన రాజకీయ ప్రత్యర్థిని ఇరికించాలనే ప్రతీకార రాజకీయంతో ఒక ఇంటర్నేషన్ ఈవెంట్ ను కాన్సిల్ చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు డ్యామెజ్ చేయడాన్ని కురచ బుద్ధి అనక ఇంకేమనుకోవాలే చెప్పండి.