రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) డిసెంబర్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో ఉన్న అన్న బోయిన రాధ,గొల్ల సుజాత,రాగి రాజయ్య, నర్సాగౌడ్,ల్యాగల సతీష్, కొంతలపల్లి స్వామి బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు.ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అన్న బోయిన సావిత్రి కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు.ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లలకు 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఆయన వెంట టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్,రాయిలాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సార్గు యాదగిరి, జిన్న సహదేవ్,వెంకట్ గౌడ్,చాకలి రామచంద్రం,పోచబోయిన కుమారస్వామి, భూకరుణ,సార్గు రమేష్,రాజేందర్, జిన్న ఎల్లయ్య,జిన్న శంకర్, తాడెం రాజు తదితరులు పాల్గొన్నారు.