+91 95819 05907

పోడు భూముల అర్హతలను ప్రజా ప్రతినిధులతో చర్చించి గుర్తించండి: మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క

సిల్వర్ రాజేష్ నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా
ఆగస్ట్-17-2024.

పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ పర్యావరణ గ్రామీణాభివృద్ధి శాఖాల మంత్రులు కొండా సురేఖధనసరి సీతక్కలు అధికారులను ఆదేశించారు.
శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లు అటవీశాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంత ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పోడు భూముల్లో సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నితమైన పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దనీ క్రమశిక్షణా చర్యలకు గురికావద్దని మంత్రి సురేఖ సూచించారు.
పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడడంలోనూ అటవీశాఖ భూములను కాపాడే విధులను నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రులు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్ళుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో చర్చించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పోడు భూముల పరిష్కారానికి కృషి చేస్తామని,
ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు డిఎఫ్ఓ జోజి గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు…దొండపాటి రమేష్

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గం ప్రతినిధి కొణిజర్ల :వ్యవసాయంలొ రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టనీకుండా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం

Read More »

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం :రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య

రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికై గ్రౌండింగ్ అయి అకౌంట్లో

Read More »

ప్రేమ పెళ్లి చేసుకున్నాడు… మొఖం చాటేస్తున్నాడు.. న్యాయం కొరకు ధర్నాకు దిగిన వివాహిత

💥 బ్రేకింగ్ న్యూస్….. 💥 బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, పిచ్చయ్య. న్యాయం చేయాలంటూ భాదిత మహిళా ఆవేదన. బోనకల్

Read More »

సీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. – ఉత్తర్వులు జారీ చేసిన కేన్ కమిషనర్ జి. మల్సూర్. – మంత్రి పొంగులేటి సూచనల మేరకు నూతన కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు జీవోలో వెల్లడి.

Read More »

ఆదివాసీ ఐకస మహిళా నూతన కార్యదర్శిగా. కుంజా. దుర్గ

నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ కొమురం భీం భవన్ ఎస్టీ వర్గీకరణ సాధనకై ఆదివాసి ఆడపడుచులందరూ ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చిన… కుంజ దుర్గ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ అధ్యక్షన జరిగిన ఆదివాసి మహిళా

Read More »

వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.

ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా కళా మండలి అధ్యక్షులు మాసాయిపేట యాదగిరి మాదిగ. మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి జనవరి 29. ఫిబ్రవరి 7 వ తేదీన హైదరాబాద్

Read More »

 Don't Miss this News !