+91 95819 05907

బి.సి హక్కుల కోసం బి.సి న్యాయవాదులు ముందుండాలి

◆కరీంనగర్ బార్ లో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఐ ఎల్ పి ఎ నాయకులు

బి.సి హక్కుల సాధన కోసం చట్టం, న్యాయం, రాజ్యాంగం తెలిసిన బి.సి న్యాయవాదులు ముందుండాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాంసన్ అన్నారు. బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ బార్ అసోసియేషన్ లో సీనియర్ న్యాయవాది కట్ట రమేష్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా 60 శాతం పైగా జనాభా కలిగిన బి.సి ప్రజలను ఇంకా మనుషులుగా గుర్తించడం లేదని, జనగణన కోసం 70 ఏండ్లుగా ఎన్ని పోరాటాలు చేసినా నేటికీ బి.సి జనాభా లెక్కలు చేయడం లేదని, జనాభా లెక్కలు చేయకుండా బి.సి లకు రిజర్వేషన్లు పెంచి కోర్టులల్లో వేగిపోయేలా చేస్తున్నారని అన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన జనగణన తర్వాత ఇప్పటికీ జనగణన జరగలేదని, కుల జనగణన కోసం, చట్టసభల్లో బి.సి వాటా కోసం కోసం దేశవ్యాప్త ఉద్యమం అవసరమని, ఆ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని అన్నారు.
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో కుల జనగణన – ఒబిసి ల అభివృద్ధి, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు – సామాజిక న్యాయం, మహిళా కోటాలో బి.సి మహిళా వాటా, బి.సి ఓటర్ల బానిసత్వం – పాలక వర్గాల ధోరణి అనే నాలుగు అంశాలపై ప్రముఖులైన బి.సి కమీషన్ చైర్మన్ వకులాబరణం కృష్ణ మోహన్, కర్ణాటక హై కోర్టు న్యాయవాది ఎస్ బాలన్, పూనే న్యాయవాది వాసంతి నల్వడా, ప్రొఫెసర్ సింహాద్రి, మధ్యప్రదేశ్ న్యాయవాది వినాయక్ ప్రసాద్ లాంటి వారు ఈ సదస్సులో బి.సి ల స్థితిగతులు, భవిషత్ ఉద్యమం పట్ల ప్రసంగిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కట్ట రమేష్ మాట్లాడుతూ కాకా కలెక్కర్, మండల్ కమీషన్ లాంటివి ఎన్ని నివేదికలు ఇచ్చినా , ఎన్ని పోరాటాలు చేసినా ప్రధాన రంగాలైన న్యాయ వ్యవస్థ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో నేటికీ బి.సి లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. సామాజిక న్యాయ సమరంలో న్యాయవాదులు ముందుండాలని, బి.సి సమాజం ఐక్యతగా సాగి చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో వారి వాటా వారు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25 న హైదరాబాద్ లో జరుగు బి.సి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును వియవంతం చేయడంలో కరీంనగర్ జిల్లా న్యాయవాదులు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్క్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్, జూకూరి మహేష్, కరీంనగర్ బార్ అససియేషన్ లైబ్రరీ సెక్రటరీ కటకం రాజేందర్, స్పోర్ట్స్ సెక్రటరీ రవి పటేల్, కార్యనిర్వహక సభ్యులు కొండ్ర లక్ష్మణ్, న్యాయవాదులు వాసాల నరేష్, గొంటి మధు, బొజ్జ స్వామి, రాజేష్ యాదవ్, రవీంద్ర స్వామి, మనోహర్ పటేల్, వెన్నం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు జడ్జికి వినతిపత్రం అందజేత.

నేటి గదర్ న్యూస్ జనవరి 28:వైరా ప్రతినిధి వైరా,కొణిజర్ల,తల్లాడ,ఏన్కూర్, చింతకాని మండలాల ప్రజలు ప్రస్తుతం కోర్టు కేసుల నిమిత్తం మధిర, సత్తుపల్లి, లేదా ఖమ్మం వెళ్ళవలసి వస్తుంది. బలహీన వర్గాలు, మహిళలు మరియు సీనియర్

Read More »

అవును…నే ల పై కూర్చున్నది ఐటీడీఏ పీఓ నే!

నేటి గద్దర్ న్యూస్ , కరకగూడెం: అవును అనేలపై కూర్చున్నది ఓ సామాన్య వ్యక్తి అనుకుంటే పొరపడినట్లే… ఆదివాసి బిడ్డలతో మమేకమై హోదాను మర్చి నేలపై కూర్చున్న ఆ వ్యక్తి భద్రాచలం ఐటిడిఏ పిఓ

Read More »

చిరుమళ్ళ సమ్మక్క సారలమ్మను సందర్శించిన ఐటీడీఏ పీవో

★జాతర ఏర్పాట్లపై సమీక్షసమావేశం పివో రాహుల్ నేటి గదర్ కరకగూడెం:మండలంలోని చిరుమళ్ళ గ్రామపంచాయతీ లోని సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న ఐటీడీఏ పిఓ రాహుల్. ఆలయ ప్రధాన ద్వారం వద్ద సమ్మక్క సారలమ్మ ఆలయ

Read More »

ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ యూనియన్ ఎన్నికలలో విజయం సాధించిన మారగాని వెంకట్

నేటి గదర్ న్యూస్ జనవరి 28, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ అనుబంధ రంగాల మిత్రులకు, ఈరోజు జరిగిన ఖమ్మం జిల్లా

Read More »

ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

★ఎన్నికల కోసమే ప్రజలను మభ్యపెట్టడమే ప్రభుత్వం పని నేటి గదర్ కరకగూడెం:అడ్డమైన పథకాలతో ప్రజలను మోసం చేసి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బిఅర్ఎస్

Read More »

గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనికి చేసిన- ఐటీడీఏ పిఓ బి రాహుల్

. *పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.* నేటి గదర్ కరకగూడెం:మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపాధ్యాయులతో పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు హాజర్

Read More »

 Don't Miss this News !