నేటి గదర్ న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, (కౌశిక్ కుక్కల), ఆగస్టు 17 :
కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై సభ్య సమాజం తలదించు కునే విధంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భూక్య జంపన్న ములుగు BRS నియోజకవర్గ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో కలకత్తా నగరంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై కొందరు దుండగులు చేసిన అత్యాచారాన్ని నిరసిస్తూ జంపన్న అత్యాచార నిందితులను గుర్తించి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరారు.
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అగాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. మహిళలపై దాడులు శిక్షించుటకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని అయన కోరారు.