ములకలపల్లి. నేటి గద్దర్ న్యూస్. మండలం లోని సత్యంపేటలో ములకలపల్లి మాజీ ఎంపీపీ సడియం బక్కులు దంపతుల తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కొద్దిసేపు ముచ్చటించారు. మండలం లోని పూసు గూడెం ,కమలాపురం గ్రామాల్లో గల సీతారామ పంపు హౌస్లను సందర్శించడానికి విచ్చేసిన మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే జారే మార్గ మధ్యలో గల సత్యంపేట గ్రామంలో ములకలపల్లి మాజీ ఎంపీపీ సడియం బక్కులు దంపతుల తో కాసేపు ముచ్చటించారు. మంత్రి తుమ్మల వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు అనంతరం ఆయన మాట్లాడుతూ 80 ఏళ్ల వయసులో బక్కులు ఊరికి డ్రైన్ కావాలని అడుగుతున్నారని పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ కి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు కి చెప్తూ బక్కులు గొప్ప గుణాన్ని తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో గ్రామానికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు సురభి రాజేష్, వెలకం వెంకటేష్ యువజన విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
