◆పైసా పెట్టే నాయకులకు కాదు. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి….. నవీన్ యాదవ్ డిమాండ్.
నేటి గద్దర్ మెదక్ జిల్లా రిపోర్టర్ తో మాట్లాడుతూ.
మాసాయిపేట మండలం నేటి గద్దర్ మార్చి 4.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీలో రోజురోజుకు పోటి పెరుగుతుంది. దీంతో నాయకుల అంచనాలు తారుమారవుతున్నయి. సీనియర్లను వదిలిపెట్టి కొత్తగా వచ్చిన వారికి పదవులు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అని నవీన్ యాదవ్ అన్నారు. బిజెపి మాసాయిపేట మండల అధ్యక్షుని రేసులో తాను కూడా ఉన్నానని, తాను 2016 నుండి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్ననన్నారు. రాజకీయంగా మరియు యువనాయకత్వాన్ని మండలంలో అన్ని మండలాల కంటే ముందు మాసాయిపేట బిజెపి మండల కమిటీని మెజార్టీ పరంగా ముందు ఉంచుతానని 2016 నుండి సామాన్య కార్యకర్త నుండి కష్టపడి మండల ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నానని మండల అధ్యక్షుడు పదవి ఇస్తే మండలంలో యువతతో పాటు మండల ప్రజల ఆశీస్సులతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. మండల వ్యాప్తంగా అందరితోనీ మండల కమిటీని నిర్మాణం చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. మండల అధ్యక్షునిగా తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని నవీన్ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కమిటీ తక్షణమే స్పందించి మాసాయిపేటలో నూతన బిజెపి మండల కమిటీని వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మాసాయిపేట మండలంలోని ఒక బీసీ బిడ్డగా నవీన్ యాదవ్ కు మండల పదవి ఇస్తే బాగుంటుందని పలువురు బిజెపి కార్యకర్తలు నాయకులు తెలిపారు.