చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
అంబరాన్నంటిన సంబరాలు ఎమ్మార్పీఎస్(MRPS) ఆధ్వర్యంలో
చర్లమండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ నుండి బైకు ర్యాలీతో నినాదాలు చేస్తూ సుప్రీంకోర్టు ఎస్సీ(SC) వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి శ్రీ మందకృష్ణ మాదిగ ఫోటోకి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ ,ఎంఎస్పి సంఘ నాయకులు .ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ,ఎంఎస్పి మండల ఇన్చార్జీలు మచ్చ వీర్రాజు మాదిగ, అలవాల సతీష్ మాదిగ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర లో అడుగు పెట్టనున్న మాదిగ, ఉప కులాలు . భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు మాదిగ ,మాదిగ ఉపకులాకు జరిగిన అన్యాయాన్ని, కళ్ళ కు కట్టినట్టు, తమ వాదన వినిపించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక మాదిగల తరఫునుండి కృతజ్ఞతలు.మూడు దశాబ్దాల కాలంలో శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాలే కాకుండా, దేశవ్యాప్తంగా ,మాదిగలు చేస్తున్న పోరాటానికి భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఇచ్చిన తీర్పుతో మాదిగ ,మాదిగ ఉప కులాలకు సమన్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీ మందకృష్ణ మాదిగ యే పిలుపు ఇచ్చిన, మన న్యాయమైన పోరాటానికి మండలంలో మాదిగ గ్రామాల నుండి, నిత్యం కృష్ణ మాదిగ అడుగుజాడలో నడుస్తూ, పోరాట పటిమతో,ఉద్యమలు చేసిన, పోరాడిన మాదిగలకు, మాదిగ అమర వీరులకు, మాదిగల పోరాటానికి సహకరించిన, మాదిగల, ఉప కులాలకు న్యాయమైన డిమాండ్ ను,అనునిత్యం ప్రజల్లో మాట్లాడిన వివిధ పార్టీ నాయకుల పెద్దలకు, అఖిల పక్ష పార్టీ నాయకులకు,ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, జర్నలిస్టులకు , ఎమ్మార్పీఎస్ సానుభూతిపరులకు ,మేధావులకి అందరికీ పేరుపేరునా మాదిగ ,మాదిగ ఉపకులాల పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. ఇదే స్ఫూర్తితో శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరెన్నో సామాజిక ఉద్యమాలకి సిద్ధం కావాల్సిన అవసరమే ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొగ్గుల ప్రవీన్, పూసం సోమరాజు, శ్రీను, మచ్చా రాజా, నాగరాజు, సురేష్, కొడారి కళ్యాణ్, కాతినేని నరసింహారావు, పూసం నరసయ్య, బాలరాజు, మచ్చ వీరభద్రం, కనుకు వీరభద్రం, రామకృష్ణ, వంకాయల వినోద్ , గుద్దేటి సాయి,తదితరులు పాల్గొన్నారు