చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
కలివేరు,బట్టి గూడెం పోడు భూముల ఆక్రమణ నిలుపుదల చేయాలి.
ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ వారి దుర్భసలాడిన డిఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి.అని పిఓ కి వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ.
కలివేరు పోడు భూములను ఫారెస్ట్ వారి ఆక్రమణను నిలుపుదల చేయాలని,సాగు చేసుకుంటున్న భూమిలో మొక్కలు విధ్వంసం చేసి ట్రెంచ్ వేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అడ్డం వెళ్లిన ఆదివాసీ మహిళలపై డిఆర్ఓ దుర్భిషలడడం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐటీడీఏ పీవో (PO) వినతిపత్రం సమర్పించడం జరిగింది.
అనంతరం *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* అధ్యక్షతన జరిగిన కార్యక్రమo లో *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు* మాట్లాడుతూ కలివేరు గ్రామ ప్రజలు పూర్తిగా ఆదివాసీలు వారు 2005 కంటే ముందు నుంచే బట్టుగూడం దగ్గర భూమి కొట్టుకుని సాగులో ఉన్నారు.ఈ సంవత్సరం ఫారెస్ట్ వారు భూమి మీద మొక్కలు వేస్తామని బెదిరిస్తున్నారు.ఈ విషయంపై పిఓ కు గతంలో వినతిపత్రం ఇచ్చి ఉన్నారు. వారి సమక్షంలో పరిశీలనలో ఉండగా ఫారెస్ట్ వాళ్ళు కాలువల పేరుతో ట్రెంచ్ ల పేరుతో వేసుకున్న పంటను మొత్తం విధ్వంసం చేశారు.అడ్డు వెళ్లిన ఆదివాసి మహిళలని డిఆర్ఓ రామకృష్ణ అసభ్య పదజాలంతో దూషించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం.
పూర్తిగా ఆదివాసీలు వారి దశాబ్దాలుగా ఆ భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నారు.అటవీ హక్కుల చట్ట ప్రకారం వారు సర్వే కి అప్లై చేసుకున్నటువంటి ప్రజల దరఖాస్తులు కొంతమంది స్వార్థపరులు కోట్టి పారేశారని ఆయన అన్నారు. ఇప్పటికైనా భూమి మీద తీసుకొచ్చిన జెసిబిలను వెనక్కి తీసుకుపోవాలనీ, ట్రెంచ్ లను ఆపాలని ఆదివాసి మహిళలపై దుర్భాషలాడిన డిఆర్ఓ రామకృష్ణ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.అనంతరం వినతి పత్రం తీసుకున్న పిఓ(PO) మాట్లాడుతూ తక్షణమే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వర్ రావు, డివిజన్ నాయకులు వైయస్ రెడ్డి సోయం లక్ష్మి సబ్కా నాగలక్ష్మి బుర్ర సీతమ్మ పూనం గంగమ్మ పూణ్యం విజయలక్ష్మి పూనం సుజాత వెంకటరమణ అలవాల రవణ అలవాలు సమ్మక్క,అదిలక్ష్మి,సీతమ్మ, కొరియం నారాయణమ్మ పొడియం తొలిసమ్మ తదితరులు పాల్గొన్నారు