+91 95819 05907

నేడే ప్రజా యుద్ధనౌక జన్మదినం.

కవర్ స్టోరీ బై నేటి గదర్ ఖమ్మం జిల్లా ప్రతినిధి : ప్రజా యుద్ధనౌక, తెలంగాణ మళిదశ ఉద్యమ స్ఫూర్తి, వక్త , రచయిత, ప్రముఖ గాయకుడు గద్దర్ కు జన్మదిన శుభాకాంక్షలు. వారి జీవితం నేడు ఎంతో మందికి ఉద్యమ స్ఫూర్తి, అలాంటి గద్దర్ గురించి, మీ నేటి గదర్ పత్రికలో మరి కొన్ని విషయాలును నేటి గదర్ ఖమ్మం జిల్లా ప్రతినిధిగా మీతో పంచుకొంటున్నాను . గదర్ అసలు పేరు తెలుసా? ఇతని పేరే గుమ్మడి విట్టల్ రావు. ఇతను తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడు. ప్రజా గాయకుడు, గద్దర్ జీవితంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. సాధారణ కుటుంబంలో పుట్టిన గద్దర్ అసాధారణ స్థాయిలో ప్రజాదరణ పొందాడు. ప్రజలను చైతన్యం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎనలేని అభిమానం సంపాదించుకున్నాడు గుమ్మడి విట్టల్ రావు.గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1949 జనవరి 31- 2023, ఆగస్టు 6) విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన “గదర్ పార్టీ” కు గుర్తుగా తీసుకోవడం జరిగింది. కుటుంబ నేపథ్యం : గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వాడు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఆ తర్వాత అతను అనేక పాటలు రాసాడు. 1972 లో పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు జన నాట్య మండలి ఏర్పడింది. ఇది దళితులను మేల్కొలిపేందుకు, వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్షను రాసాడు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరాడు, తర్వాత అతను విమలను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల.
సినిమా నేపథ్యం :
మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడాడు.1984 లో ఆయన క్లార్కు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సిడిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి.

సినిమారంగం :
మార్చు
మాభూమి సినిమాలోని ‘బండెనక బండి కట్టి’ అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది. అలాగే ఆయన రాసి పాడిన ‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్‌ ఎంపిక చేసింది.2016లో దండకారణ్యం మువీ, 2022లో విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్ నటించిన చివరి సినిమా. తెలంగాణ ఉద్యమం : పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించాడు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు.

గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ను స్థాపించాడు. అవార్డులు : 1995: నంది ఉత్తమ గీత రచయిత (ఒరేయ్ రిక్షా సినిమాలోని “మల్లెతీగ కు పందిరి వోలె” పాట రచన… కానీ ఆయన అవార్డును తిరస్కరించాడు)
2011: నంది ఉత్తమ నేపథ్య గాయకులు (జై బోలో తెలంగాణ సినిమాలోని “పొడుస్తున్న పొద్దు మీద” పాట
ఈశ్వరీబాయి మెమోరియల్‌ సెంచరీ అవార్డు. మరణం : గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్‌, అమీర్ పేట్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. తరువాత ఆసుపత్రిలోనే చికిత్సపొందిన గద్దర్ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు.

గద్దర్ మృతికి తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆగస్టు 6 సాయంత్రం నుండి ఆగస్టు 7 మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం గద్దర్‌ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచబడింది. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కవులు, కళాకారులు, వేలాదిగా అభిమానులు గద్దర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్కు నుంచి బషీర్‌బాగ్‌, లిబర్టీ, జేబీఎస్‌ మీదుగా 6 గంటలపాటు 17 కిలోమీటర్ల దూరమున్న అల్వాల్‌లోని గద్దర్‌ నివాసం వరకు కొనసాగింది.అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గద్దర్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాల ఆవరణలో అధికార లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వంను విజ్ఞప్తి చేసిన విమల : దివంగత గద్దర్ జయంతిని ప్రతి ఏడాది జనవరి 31న అధికారికంగా నిర్వహించాలని ఆయన కూతురు వెన్నెల మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విజ్ఞప్తి చేయగా దీనిపై స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయగా జనవరి 31న ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వడదెబ్బ కి మహిళ మృతి? కుటుంబ సభ్యులు తెలిపిన కారణాలు ఇవే.

మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యురాలు తాటి రత్తాలు (55 సం) శుక్రవారం రాత్రి వడదెబ్బ సోకి మృతి చెందింది. ఆదివారం తన చెల్లి కూతురు

Read More »

సింగరేణి గ్రామ ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం :షేక్ గౌసిద్దీన్.

-కులమతాలకు అతీతంగా సింగరేణి గ్రామంలో సేవా కార్యక్రమాలు. -హిందూ స్మశానవాటిక కు రూ.25 వేల సబ్ మెర్సబుల్ పంప్ సెట్టు వితరణ. తన సేవా తత్పురతను చాటుకుంటున్న -బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు,

Read More »

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

 Don't Miss this News !