నేటి గదర్ న్యూస్, మార్చి4,వైరా :మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దానిలో భాగంగా స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ఇందిరమ్మ ఇళ్ల నమూనా ని నిర్మించితే ప్రజలు దాన్ని చూసి అదే విధంగా ఐదు లక్షల వ్యయంతో కట్టుకోవడానికి అనువైన విధంగా ఉంటదని సందర్శనార్థం దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ నమూనాన్ని పరిశీలించుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేగా మీ పక్షాన ఉండి ప్రతి పేదవాడు కలను సహకారం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, బోళ్ళ గంగారావు, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, శీలం చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి సీతారాములు, నారవనేని అశోక్, ఆది ఆనందరావు, కర్నాటి హనుమంతరావు, గద్దె మల్లికార్జున్, తెళ్ళురి వీరయ్య, నాగనబోయిన కృష్ణ, యంగల కృష్ణ, లక్ష్మణ్ నాయక్, వేల్పుల భరత్, కంభంపాటి సత్యనారాయణ, కట్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.
