రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 18:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 21 నుండి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.రామాయంపేట మండల వ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పాఠశాలల విద్యార్థులకు ఫర్నిచర్,టాయిలెట్స్,త్రాగునీటి సౌకర్యం అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పరీక్ష రోజున ఉదయం 9 గంటలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.ఈ పరీక్షలకు సమయం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.రామాయంపేట మండలంలో గల ఐదు పరీక్ష కేంద్రాల్లో 752 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు.ఇందులో అబ్బాయిలు 374 మంది అమ్మాయిలు 378 మంది ఉన్నట్లు వెల్లడించారు.ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో తమకు సహకరించాలని తెలియపరచారు.
