– జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.
– బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు.
నేటి గదర్ న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి.
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నెల్లూరి కోటేశ్వరరావు నియమితులైన అనంతరం, ఆయన పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, పార్టీ పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకుని, ఖమ్మం జిల్లాలో బీజేపీ బలోపేతానికి సంబంధించిన కీలక సూచనలు, మార్గదర్శకాలను స్వీకరించారు.
కోటేశ్వరరావు ముందుగా ప్రముఖ జాతీయ నేత, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కో-ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని కలిసి, ఆయన అనుభవాలను తెలుసుకున్నారు. అలాగే, పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కలిసిన ఆయన, ఖమ్మం జిల్లాలో బీజేపీ మరింత బలపడేలా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందుకున్నారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, “బీజేపీ సిద్ధాంతాలను, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంకల్పబద్ధంగా ముందుకు సాగుతాను. రాష్ట్ర, జాతీయ నేతల ఆశీర్వాదంతో, పార్టీ కార్యకర్తల అండతో ఖమ్మం జిల్లాలో బీజేపీని మరింత బలపరుస్తాం” అని అన్నారు.
పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం, జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ఆలోచనలు ప్రారంభించారు. త్వరలోనే భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించి, బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను ప్రకటించనున్నట్టు తెలిపారు..