రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 18:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాలకు విద్య ఉద్యోగ రాజకీయపరంగా 42% రిజర్వేషన్ ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ఈ బిల్లును వెంటనే పార్లమెంట్ కు పంపి కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వాన్ని తెలంగాణ అఖిలపక్షం కలిసి పార్లమెంట్ లో ఆమోదించే విధంగా కృషి చేయాలని బీసీ నాయకులు కోరారు.తెలంగాణలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల విద్య వైద్య రాజకీయంగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ మరియు ఈ 42% శాతం బిల్లుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్,బిజెపి మరియు సిపిఐ,సిపిఎం అన్ని పార్టీలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం,జిల్లా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు రెడ్డమైన నరేష్,పోచమ్మల గణేష్ రామాయంపేట మున్సిపాలీటి అధ్యక్షులు పిట్ల శ్రీశైలం వికలాంగుల సంఘం అధ్యక్షులు కుమ్మరి కుమార్,బీసీ నాయకులు పోచమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు.
