నియోజకవర్గాల పునర్విభజన పై నేడు.
అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.
అందరికీ ఆమోదయోగ్యమైన వేదిక.
సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పై ముందస్తుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని గత క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో మాట్లాడాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు, సీనియర్ నేత జానారెడ్డిలకు సీఎం సూచించారు. ఆ సూచనలో భాగంగా ఇప్పటికే రాజకీయ పార్టీలకు బహిరంగ లేక విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా శనివారం సీనియర్ నేత జానారెడ్డి తో వారి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా శనివారమే అన్ని పార్టీల నాయకులతో ఫోన్లో మాట్లాడి .. ఎవరికి ఇబ్బంది లేని వేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లేదా పూలే ప్రజా భవన్ అనే అంశాలు వారితో చర్చించి ఖరారు చేయాలని నిర్ణయించారు.