◆విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి
◆ప్రజా ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధికి నోచుకోదా
◆ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 – 2026 సంవత్సర మొత్తం బడ్జెట్. 3,04,965 కోట్లు. విద్య రంగానికి కేవలం 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించడం విద్యార్థి లోకానికి తీవ్రఅన్యాయం చేస్తుంది అని అన్నారు ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అన్నారు . ప్రజా ప్రభుత్వం లో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి నోచుకోదా.? ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తాం అన్న మాట ప్రభుత్వం మర్చిపోయిందా. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి నికి 30% నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన ఇప్పటికీ విద్యారంగా సమస్యలు పరిష్కారం కాలేదు అని ఆవేదన వంశీ వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 నెలలు కానున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా విచారకరం. ఇది విద్యా రంగంలో పాలనాపరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. మంత్రిని నియమించడం ద్వారా విద్యా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించగలుగుతుందని అభిప్రాయ పడ్డారు. కావున తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బడ్జెట్లో విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరించారు.