రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు గత ఏడాది కంటే 0.20% కేటాయింపులు తగ్గాయని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15% ఇచ్చిన హామీకి బడ్జెట్లో కేటాయించిన దానికి పొంతనలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ తెలిపారు.బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు.ప్రస్తుత బడ్జెట్లో కేవలం విద్యకు కేటాయించింది.రూ 23108 కోట్లు అని (7.57%).గత సంవత్సరం రూ 274058 కోట్ల బడ్జెట్ లో విద్యకు కేటాయించింది.రూ 21292 కోట్లు (7.77%) అంకెల్లో రూ 1816 కోట్లు పెరిగినట్లుగా ఉన్నప్పటికీ శాతాల్లో చూస్తే గత సంవత్సరం కంటే తగ్గిందన్నారు.విద్యాశాఖ పరిధిలో ఉన్న 26067 పాఠశాలలను గాలి కొదిలేసి,రెసిడెన్షియల్,యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతున్నదని.గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది మాత్రమేనని,అదే ప్రభుత్వ, జిల్లాపరిషత్,మండల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 16 లక్షల మంది వరకు ఉండగా,వారిలో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారు మరియు బాలికలు ఉన్నారన్నారు.వీరికి నాణ్యమైన విద్య అందించడానికి ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవునని,విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, మెరుగైన మధ్యాహ్నభోజనం అందించేందుకు,నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా విద్యకు15% నిధులు కేటాయించాలని,అలాగే 1023 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా 662 రెసిడెన్షియల్ స్కూల్ లకు సొంత భవనాలు లేవని, ఉన్నవాటికి కేటాయించకుండా కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం 11600 కోట్లు కేటాయించిందని,ఇక మిగిలింది ఏందని అయన ప్రశ్నించారు.
