నేటి గదర్ న్యూస్,ములకలపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోరంపూడి అప్పారావు సోదరుడు రమేష్ (50) మంగళవారం సాయంత్రం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మోరంపూడి అప్పారావు ను చరవాణిలో పరామర్శించి, వారి సోదరుడు మృతిపట్ల సంతాపం తెలిపారు. మోరంపూడి రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
*మోరంపూడి అప్పారావుకు పలువురు పరామర్శ* :: మాజీ ఎంపీ నామ ఆదేశాలు మేరకు బిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్ లు బుధవారం సాయంత్రం సూరంపాలెం గ్రామం వెళ్లి మోరంపూడి అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపం తెలిపారు. వారి వెంట జగన్నాధపురం మాజీ సర్పంచ్ గడ్డం భవాని- నతానిల్, సాయిన్ని సుబ్బారావు, నున్నా సత్యనారాయణ, నామ వ్యక్తిగత కార్యదర్శి జి నాగరాజు తదితరులు వున్నారు.