+91 95819 05907

అడవిలో విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు:సీఐ శివ ప్రసాద్

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
జిల్లాలో అడవి జంతువులను వేటాడటానికి ఎవరైనా వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శివ ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. అడవి జంతువులను వేటాడే వేటగాళ్లు కరెంట్ తీగలను ఏర్పాటు చేయడం వలన పంట పొలాలకు పనులకు వెళ్లే రైతులు,జంతువులు షాక్ నకు గురయ్యి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంభవించి అమాయకులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని తెలియజేసారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ జంతువులను వేటాడటం కోసం కరెంటు తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.భూపాలపల్లి జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఆఫీసర్ అడవిలో అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంట్ తీగలకు తగిలి ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.ఎవరైనా వ్యక్తులు ఈ విధంగా అక్రమంగా కరెంటు తీగలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !