+91 95819 05907

తెలంగాణ ప్రజల విజయం. బి ఆర్ ఎస్ పార్టీ విజయం:మాజీ మంత్రి హరీష్ రావు

నేటి గదర్ న్యూస్, వెబ్ డెస్క్: ప్రజేంటేషన్ అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకు?
వాస్తవాలు సభకు తెలియాలి. ఇది చాలా బాధాకరం.
కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజల విజయం. బి ఆర్ ఎస్ పార్టీ విజయం అని తెలంగాణ అసెంబ్లీలో సోమవారం మాజీమంత్రి హరీష్ రావు అన్నారు.
రేపు నల్లగొండలో సభ పెట్టుకోవడం చూసి ఈరోజు స్పందించారు. చేసిన తప్పులు సవరించుకున్నందుకు ధన్యవాదాలు.
రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడటం సరికాదు.
*ప్రాజెక్టుల విషయంలో ఉత్తం మాటలు ఉత్తవే*

పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రెండు నెలల్లో అప్పగించారు.
నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషం. మేము స్వాగతిస్తున్నాము.
కాంగ్రెస్ కృష్ణా అంశంపై ఇచ్చిన దానిలో వాస్తవాలు కాదు అవి అవాస్తవాలు. అవాస్తవాల పుస్తకం అని బుక్ పేరు రయల్సింది.
ప్రాజెక్టులు అప్పగించే విషయం నాటి ప్రభుత్వం ఒప్పుకున్నది అని అబద్ధాలు చెప్పింది. అవాస్తవాలు చెప్పింది.
*అవాస్తవం1*
అపెక్స్ కమిటీ మీటింగ్ లో కే అర్ ఎం బి అప్ఫించలేదు. ఎందుకంటే మ్యాటర్ సబ్ జుడిస్ అని ఉంది.

*అవాస్తవం2*
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ సవాలు చేయలేదు అన్నారు. దీనికి సాక్ష్యం రాహుల్ బొజ్జా గారు రాసిన ఆధారం చుడోచ్చు. 15.07.2021 గెజిట్ లో మాడిఫికేశన్ చేయాలని రాశారు.

*అవాస్తవం3*
16 వ కె ఆర్ ఎం బి సమావేశంలో చెప్పింది ఏమిటి. ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని స్పష్టం చేశారు.

*అవాస్తవం4*
రెండో అపెక్స్ కౌన్సిల్ లో నీటి వాట వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయం పై 27 లెటర్స్ రాయడం జరిగింది.

ఈ ఏడాది జనవరిలో జరిగిన మీటింగ్ ప్రకారం, ఎపీ, తెలంగాణ చర్చల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ 7 రోజుల్లో అప్పగిస్తామని ప్లాన్ తో మీ ముందుకు వస్తాం. నెల రోజుల్లో ప్రాజెక్ట్ అప్పగిస్తాము. సాగర్ డ్యాం వద్దకు వెళ్ళాలంటే కే ఆర్ ఎం బి అనుమతి కావాలి. బోర్డుకు రాష్ట్రాలు డబ్బులు ఇస్తాయి. వీటన్నిటికీ ఒప్పుకున్నది మీరు.

ఇదే విషయంపై పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. ఎందుకు నోరు మెదపలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టీ అడిగితే అపుడు లేఖ రాశారు.

కానీ ఈ ఏడాది 1 ఫిబ్రవరి న జరిగిన మీటింగ్ లో మళ్లీ బోర్డుకు అప్పగిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాలు చెల్లిస్తామని, మ్యాన్ పవర్ అవసరం గురించి ఒప్పుకున్నారు.

తప్పిదాన్ని ఒక అధికారి మీదకు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అన్ని ఆధారాలు మీరు ఒప్పుకున్నట్లు స్పష్టం అవుతున్నది.

మీ తీర్మానానికి మా మద్దతు ఉంటుంది. కానీ గత రెండు మీటింగ్ లలో తెలియకుండా ఒప్పుకున్నాము, అని సభకు క్షమాపణ చెప్పండి.

ప్రజలకు అర్థం అయ్యింది. వీరు ప్రాజెక్టులు ఒప్పుకున్నారు అని.

299:512 ఒప్పుకున్నది మేము అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. హడ్ హక్ వాటర్ షేర్ ఒప్పుకునేది లేదని చెప్పాము. అనేక సార్లు లేఖ రాశాము.

కాంగ్రెస్ వల్లనే ఈ 299:512 షేర్ వచ్చింది. వీరే దానికి కారణం. మేము 50:50 రేషియో గురించి అనేక సార్లు లేఖలు రాసాము.

కుడిదిల పడ్డ ఎలుక లెక్క అయ్యింది కాంగ్రెస్ పరిస్థితి.
స్మితా సబర్వాల్ గారు ప్రాజెక్ట్లుఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు.

అపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం అయ్యేదాకా 50:50 ఇవ్వండి అని కేంద్రానికి రాయడం జరిగింది. ఇదే విషయం రాహుల్ బొజ్జా గారు కూడా చెప్పారు.

కేసీఆర్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. దురదృష్టం ఏమిటంటే కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సీటు లేదు.

తెలంగాణకు అవమానాలు జరిగితే, తనకు అవమానంగా భావించి ఒక్కడిగా బయల్దేరి కొట్లాడాడు.

సోనియమ్మను దేవత, బలిదేవత అన్నదేవరో ప్రజలకు తెల్సు.

తెలంగాణలో పరిపాలన చేత కాదు అన్నోళ్ళ నోరు మూపించింది కేసీఆర్.

సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కరువు ప్రాంతాల్లో వాడుకోండి అని నాడు మేము అన్నాము.

బడ్జెట్ మొన్న ప్రవేశ పెట్టాం. దాని మీద చర్చ లేదు. రేపటి నల్లగొండ సభ పుణ్యమే.ఈరోజు కృష్ణా అంశంపై చర్చ పెట్టారు.

స్వాగతిస్తున్నామని చెబుతున్నా. కానీ మీరు అంతకు ముందు ప్రాజెక్టులు అప్పగించినందుకు క్షమాపణ చెప్పాలి.

రెండు రోజులైనా కే ఆర్ ఎం బి మీద చర్చ పెడదాం అన్నారు. ఇప్పుడు మైకులు ఇవ్వడం లేదు.

14 జూలై 2014 కృష్ణా, నది జలాలను పున పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ గారు నాడు కేంద్రాన్ని అడిగారు.

నదీ జలాల చట్టం ప్రకారం ఏడాది గడించింది. అందుకే ట్రిబ్యునల్ వేయాలని మేము సుప్రీం కోర్టుకు వెళ్ళాం.

ఆ తర్వాత కేసు వాపస్ చేసుకుంటే, సెక్షన్ 3 కింద పిర్యాదు చేసినా ప్రతిఫలం లేదు.

ట్రిబ్యునల్ ద్వారా సమయం పెడిదాం 6 నెలల లాగా ప్రాజెక్టులు వారీగా నీళ్ళు కేటాయించాలని అడుగుదాం.

మేము 9 ఏళ్లు కష్టపడితే ట్రిబ్యునల్ వచ్చింది. మీరు పోరాటం చేయండి మేము సహకరిస్తామని చెబుతున్నాం.

సముద్రం లో కలిసే గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. అంతే గానీ కృష్ణా జలాల గురించి చెప్పలేదు.

రాయలసీమ లిఫ్ట్ గురించి 5-5-2020 జీఓ వచ్చింది. అంతకు ముందే జనవరి 29, 2020 నాడే కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేశాం. 12-05-2020 నాడు ఆపాలని లేఖ రాసాము.

బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. మేము వాస్తవాలు చెబుతున్నాం.

అపెక్స్ కమిటీ మీటింగ్ లలో కూడా చాలా స్పష్టంగా రాయలసీమ లిఫ్ట్ ఆపాలని మేము కోరడం జరిగింది. కానీ అవాస్తవాలు చెబుతున్నారు.

పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ పొక్క పెంచినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు.

మేము పేగులు తెగేదాకా కొట్లాడాం. 40 రోజులు అసెంబ్లీ స్తంబింప చేశాం.

రాయలసీమ లిఫ్ట్ పై కేసులు కూడా వేశాం. ఎన్ జి టి కి కూడా వెళ్లి ఫిర్యాదు చేసి ఆపాము.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !