ప్రమాదానికి గురైన ట్రాన్స్ఫార్మర్స్ 30 ఏళ్ళ క్రితం పెట్టినవి
ప్రమాదానికి గల కారణాలపై రిపోర్టు ఆడిగాం
*రవాణా, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తుంది అని రాష్ట్ర రవాణా,బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం విలేకరుల సమావేశంలో మాట్లాడారు…ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్ కో డైరెక్టర్ టెక్నీకల్ డైరెక్టర్ జగత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు వెంటనే స్పందించి 100,160 మెగావాట్ల దానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారన్నారు.
జరిగిన నష్టం చూసి రెండు మూడు రోజుల వరకు పవర్ రాదనుకున్న పరిస్థితి ఉండే అని
కాని వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు గురువారం ఉదయం నుండి త్రీఫేస్ కరెంటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రమాదం జరిగిన ట్రాన్సఫార్మర్స్ 20-30 ఏళ్ళ క్రితం పెట్టినవి కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు ఒక అంచనా కు రావడం జరిగింది అని తెలిపారు.
వెంటనే మరమ్మత్తులు చేపట్టడం తో పాటు సబ్ స్టేషన్ లో అవసరమైన మార్పులు చేస్తున్నాం అని తెలిపారు.
ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.
ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది.ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రి తెలిపారు.
