బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ యువనాయకులు బియ్యం వితరణ
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక), ఫిబ్రవరి 21(నేటి గదర్ న్యూస్)
పినపాక మండల పరిధి గోపాలరావు పేట గ్రామానికి చెందిన దాసరి వెంకమ్మ(65) ఇటీవల అనారోగ్యంతో మరణించారు. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు బుధవారం గోపాలరావు పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండారు గిరిప్రసాద్ ,నర్రా ఉమేష్ , కోలా నరేష్ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారి కుమారుడు దాసరి సారయ్యకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు డొంకెన సాంబశివరావు, కునారపు సత్యనారాయణ, గోరెంట్ల శ్రీను , పులుగుజ్జు జంపయ్య, కొండా రాకేష్, పులిగుజ్జు వీరన్న , వీరమల్ల వేణు మరియు తదితరులు పాల్గొన్నారు.
