*జార్ఖండ్ లో రాంచీ నందు మార్చి 4,5 జరిగే పీసా చట్టం జాతీయ సదస్సుకు ఎంపికైన గుండాల ఎంపీపీ ముక్తి సత్యం.*
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మార్చి 4,5 తేదీలలో జార్ఖండ్ లో రాంచీ పట్టణం లో జరిగే పీసా యాక్టు అవగాహన సదస్సుకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎంపీపీ ముక్తి సత్యం ఎంపికయ్యాడు.
ఈ పీసా యాక్ట్ అవగాహన సదస్సులో ఐదు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్ ఘడ్,జార్ఖండ్,ఒడిస్సా రాష్ట్ర లలోఅమలవుతున్న పిసా యాక్ట్ అమలు గురించి దాని పరిణామాలు పరిస్థితులు ఎలా ఉన్నాయో చర్చించడం జరుగుతుంది.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేపిస్తున్న పీసా యాక్ట్ చట్టం కు సంబంధం లేకుండా నూతన అటవీ సంరక్షణ నియమాలను తీసుకువచ్చారు.అలాంటప్పుడు పీసా యాక్ట్ ను నిర్వీర్యం చేయడమే అవుతుంది.కావున పిసా యక్ట్ పకడ్బందీగా అమలు కావాలంటే నూతన అటవీ సంరక్షణ నియమాలు 2022 అని రద్దు చేయాలని ఆయన కోరారు.
ఈ పిసా యాక్టు అనేది ఆదివాసీల హక్కులను కాపాడేదిగా ఉంటుంది.ఈ చట్టం కు సంబంధం లేకుండా వచ్చినటువంటి నూతన అటవీ సంరక్షణ నియమాల వలన ఆదివాసీల మూలాధారమైన అటవీ,అడవి సంపద మొత్తం దెబ్బతినే అవకాశం ఉన్నది. ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి గాని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే విధంగా ఉండకూడదని వారన్నారు.కావున పిసాయాక్ట్ గురించి పలు విషయాలను తాను జార్ఖండ్ లోని రాంచీ లో రెండు రోజుల పాటు జరిగే సదస్సులో చర్చిస్తానని ఆయన తెలియజేశారు.
