నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: చదువు విలువ తెలిసిన ఓ యువకుడు వయసులో తనకన్నా తక్కువైన కొంతమంది యువకులను తన తమ్ముళ్ల వలె భావించి చదువుకోమని వారికి హిత బోధ చేశాడు. స్మార్ట్ టెక్నాలజీకి బానిసైన ఆ యువకుల కు మంచి చెప్పినందుకు కోపం వచ్చింది. చివరికి మంచి హితబోధ చేసిన ఆ యువకుడిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. వివరాలు..
నిజామాబాద్ – బోధన్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో ఉండే డిగ్రీ విద్యార్థి వెంకట్ హరియల్(19)ని స్టడీ అవర్ ఇన్‌ఛార్జ్‌గా పెట్టడంతో.. ఇంటర్ విద్యార్థులను పరీక్షలు జరుగుతున్నాయని, మాట్లాడకుండా చదువుకోవాలంటూ సూచించాడు.
ఇది నచ్చని ఆరుగురు ఇంటర్ విద్యార్థులు రాత్రి గదిలో నిద్ర పోతున్న వెంకట్‌పై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆరుగురు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోవడంతో, పోలీసులు విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Post Views: 156