+91 95819 05907

KHAMMAM:పంతం ఎవరిది నెగ్గేనో?!

*సతి కోసం పతి…
* అనుచర గణంతో హైదరాబాదుకు 500కార్లతో భారీ ర్యాలీ తీసిన మల్లు నందిని

*సోదరుని కోసం సోదరుడు
* పొంగులేటి ప్రసాదరెడ్డిని ఏ ఐ సీ సీ హై కమాండ్ కు పరిచయం చేసిన మంత్రి శ్రీనివాసరెడ్డి
* ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచార స్పీడ్ పెంచిన ఆ ఇద్దరు
* హాట్ టాపిక్ గా ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ నియోజకవర్గం

నేటి గదర్ న్యూస్, ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం కాంగ్రెస్లో హీటెక్కింది .ఇద్దరు రాజకీయాలలో ఉద్దండులే. ఒకరు సతి కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తుండగా మరొకరు సోదరుని కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో ఒకరు ఉప ముఖ్యమంత్రి,మంత్రి, మరొకరు మంత్రి కూడా. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకే పార్లమెంట్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.ఆ ఇద్దరు కూడా ఒకే పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో చర్చనీయంగా మారింది. ఇద్దరి నేతల పోటీ పార్టీ హై కమాండ్ కు కూడ తలనొప్పిగా మారింది. నేటి గదర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధిప్రత్యేక కథనం. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం భారీ గానే డిమాండ్ఉంది. అన్ని విధాలుగా ఏ లోటు లేనిఆ ఇద్దరు నేతలు నాకంటే నాకే టికెట్ కావాలని పంతం పడుతున్నారు.వారే ఒకరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరొకరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కి ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో తన అనుచరులతో మల్లు నందిని సుమారు 500 కార్లతో మధిర నియోజకవర్గం నుండి హైదరాబాద్ కు భారీగా ర్యాలీ తీసి ఎంపీ టికెట్ కావాలనే తన బలమైన కోరికను ఏఐ సి సి అధిష్టానానికి ప్రత్యేకంగా వ్యక్తపరిచారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏఐసీసీ పెద్దలతో ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉండడం, గత పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం చే అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర సైతం నిర్వహించారు. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది .ఈ క్రమంలో భట్టి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని వారి అనుచర గణం నూరు శాతం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

*సోదరుడు పొంగులేటి ప్రసాద్ కొరకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి పట్టు*
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిమరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 కాంగ్రెస్ సీట్లు గెలిపిస్తానని శబదం చేశారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి చాలెంజ్ విసిరిన విధంగానే భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి పట్టుబట్టి టికెట్ ఇప్పించిన ఆయన అనుచరులే భారీ మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తన సోదరుడికి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నట్లు వినికిడి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసాదరెడ్డి వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపద్యంలోనే పొంగులేటి ప్రసాదరెడ్డి గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఇద్దరి ఉద్దండులకు కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా సర్ది చెబుతారో, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి తగ్గుతుందో త్వరలోనే తేలనుంది. ఏ ఒక్కరికి సీటు దక్కిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్పందన ఎలా ఉంటుందో వెయిట్ చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !