+91 95819 05907

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలు

★ఘన నివాళి అర్పించిన PACS చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి
నేటి గద్ధర్ న్యూస్, జూలూరుపాడు : స్వతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు ,PACS చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సమ సమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దిన జనుల కోసం శ్రమించిన యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ ,వెంగన్నపాలెం MPTC దుద్దుకురి మధుసూదన్ రావు , నర్వనేని పుల్లారావు , మాచినేని సత్యం , ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు , పోతురాజు నాగరాజ్ , ప్రరస్థాపరపు శ్రీను , గుంటగ నరసింహారావు , మోదుగు సుగుణ , మిరియాల కిరణ్ కుమార్, సేవాధల్ మండల కార్యదర్శి మాడుగుల నాగరాజు , మండల నాయకులు,పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !