— ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ
— రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారు
— పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సముద్రంలో కలవడం ఖాయం
— పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం గౌడ్
నేటి గద్ధర్ న్యూస్,పినపాక నియోజకవర్గ ప్రతినిధి ( పినపాక ):
ఆగస్టు 15 లోపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడని, రైతు బాంధవుడుగా చరిత్రలో నిలిచిపోతాడని, మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని… పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం అన్నారు. బుధవారం ఆయన బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయని, ఎన్నికల అనంతరం మిగతా మిగిలిన హామీ కూడా అమలు చేస్తామని, ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయాలో అర్థం కాక బస్సు యాత్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుల పదేళ్ల ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే చోటుచేసుకున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుందని, ఎన్నికల అనంతరం బిఆర్ఎస్ పార్టీని ప్రజలు సముద్రంలో కలుపుతారని అన్నారు. రాష్ట్రంలోనే అన్నింటికంటే మహబూబాబాద్ పార్లమెంట్లో రెండు లక్షల మెజారిటీతో అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించి తీరుతామన్నారు. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే నని స్పష్టం చేసారు.