– అసాంఘిక శక్తులకు సహకరించవద్దు
– – మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి
నేటి గద్ధర్ న్యూస్,పినపాక నియోజకవర్గ ప్రతినిధి:
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు అని DSP రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం పినపాక మండలం లో సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ఆదివాసీ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.పిట్టతోగు వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. వలస ఆదివాసీలకు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందని కావున అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే తెలపాలని కోరారు. అసాంఘిక శక్తులకు ఆశ్రమం కల్పించ వద్దని కోరారు. ఏజెన్సీలో అనేక ఆదివాసి గ్రామాల్లో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం చేగర్శల,జానంపేట,కిష్టాపురం,ఏడూళ్ళ బయ్యారం, పోలింగ్ కేంద్రాలను డి.ఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటప్పయ్య, పోలీస్ సిబ్బంది, టీఎస్పీఎస్సీ సిబ్బంది పాల్గొన్నారు.