నేటి గద్దర్ న్యూస్ , బోనకల్ : మధిర లో బిజెపి తలపెట్టిన బహిరంగ సభకు శనివారం మండల కేంద్రంనుండి బిజెపి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రావినూతల, ముష్టికుంట్ల, ఆళ్లపాడు, చిరునోముల గ్రామాల నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలారు. స్థానిక బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు , సానుభూతిపరులు బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, ఖమ్మం జిల్లా విద్యా, వైద్యంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్రజల విశ్వాసం కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు బిజెపి వైపు ఉన్నారని, ఖమ్మంలో తాండ్ర వినోద్ రావు గెలుపుతో పాటు కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బహిరంగ సభకు తరలి వెళ్ళిన వారిలో బిజెపి ముఖ్య నాయకులు గంగుల నాగయ్య, యార్లగడ్డ రాఘవరావు,
జిడుగు వెంకటేశ్వర్లు,దొంతు రాధాకృష్ణ,శాస్త్రి మరీదు రామారావు తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.
