★సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
★గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
★గ్రామపంచాయతీ కార్మికులకు IFTU కార్మిక సంఘం నిరంతరం అండగా వుంటుంది
★భారత కార్మిక సంఘాల సమాక్య (IFTU) భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(భద్రాచలం):
భద్రాచలం గ్రామపంచాయతీ కార్యాలయంలో (ఐఎఫ్టియు) IFTU ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల గత నిరవదిక సమ్మె కాలపు జీతాలను ఇవ్వాలని వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్యాలయ కార్యదర్శి అధికారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు IFTU (భారత కార్మిక సంఘాల సమాఖ్య) భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం జూన్ నెలలో గ్రామపంచాయతీ కార్మికులు వారి హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె జరిగిందని అందులో భాగంగానే భద్రాచలంలోని గ్రామపంచాయతీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారనీ దాదాపుగా 25 రోజులపాటు కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని అన్నారు వర్షాకాలం అయినందున కరోనా విపరీతంగా ప్రజలను పట్టిపీడిస్తున్న కారణంగా పరిసరాల పరిశుభ్రత అత్యవసరమైనందున అధికారుల సూచన మేరకు కార్మికులు విధుల్లోకి చేరారని అన్నారు ఒకపక్క ఇతర ప్రాంతాల్లో సమ్మె కొనసాగుతున్నప్పటికీ అధికారుల మాటను గౌరవించి కార్మికులు ప్రజల రక్షణ కోసం పాటుపడ్డారని అన్నారు చాలీచాలని జీతాలతోటి గ్రామపంచాయతీ కార్మికులు పడుతున్న బాధలు ఇబ్బందులు అధికారులకు తెలవనివి కాదని కాబట్టి అధికారులు మానవతా దృక్పథం తోటి ఆలోచించి సమ్మె కాలపు జీతాలను కార్మికులకు చెల్లించాలని కోరారు అంతేకాకుండా కార్మికులపై అధికారుల ప్రజా ప్రతినిధుల వేధింపులు ఆపాలని అక్రమ తొలగింపులు నిలిపివేయాలని ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని ఎనిమిది గంటల పని విధానం అమలు జరపాలని ప్రతినెల నిర్దేశిత తేదీల్లో జీతం అకౌంట్లో వేయాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అన్నారు మున్సిపల్ వర్కర్స్ గ్రామపంచాయతీ వర్కర్లు చేసేది ఒకే రకమైన పని అని కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు జీవో నెంబర్ 61 ప్రకారం స్వీపర్లకు పదిహేను వేల రూపాయలు వేతనం ఇవ్వాలని పంపు ఆపరేటర్లకు డ్రైవర్లకు బిల్ కలెక్టర్లకు కారోబార్లకు ఎలక్ట్రిషన్స్కు 19500 ఇవ్వాలని హెల్త్ కార్డులు యూనిఫారాలు రక్షణ పరికరాలు ఇవ్వాలని పిఏపీఎఫ్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాదం జరిగితే కార్మికుడి కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బిల్ కలెక్టర్ కారోబర్ లను పంచాయతీ సహాయ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశాడు ఈ కార్యక్రమంలో కార్మికులు సత్యం, నాగమణి, దుర్గా శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు